కొండాపూర్ హరితహారం అద్వాన్నం పట్టించుకునే నాధుడు లేడు

Share this:

సిద్దిపేట(V3News)20-04-2022: సిద్దిపేట జిల్లా ధూళిమిట్టా మండలం కొండాపూర్ గ్రామంలోని డంపింగ్ షెడ్ ముందు లక్షలు ఖర్చుచేసి హరితహారం మొక్కలు నాటితే వాటిని పట్టించుకునే సర్పంచ్, కార్యదర్శి నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంతో నాటిన మొక్కలు లేకపోగా ఉన్న మొక్కలకు సంరక్షణ లేక తెలంగాణ ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నిరుగారిపోతుంది, హరితహారం మొక్కలను కాపాడాల్సిన స్థానిక కార్యదర్శి నిర్లక్ష్యంతో పూర్తిగా హరితహారం అబసుపాలు అవుతుంది మండల అధికారుల పర్యవేక్షణ కరువు ఇందుకు నిదర్శనం అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొక్కలతో పర్యావరణం మానవమనుగడ అభివృద్ధి చెంది రాష్టం సుబిక్షంగా ఉంటుందనే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కే సీ ఆర్ కోట్ల రూపాయలు హరితహారం మొక్కలకు విడుదల చేస్తుంటే ఇలాంటి కొంతమంది ప్రజాప్రతినిధులు,కార్యదర్శుల నిర్లక్ష్యంతో నిధులు బూడిదలో పోసిన పన్నిలాగా అవుతున్నాయని ఏ ఒక్క రోజుకూడా మొక్కలకు నీరు పోయకుండా నామామాత్రంగా విధులు నిర్వహిస్తూ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యనికి తూట్లు పొడుస్తూన్నారని పలువురు గ్రామస్థులు తెలిపారు.తక్షణమే గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకొని చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటలని కోరుతున్నారు’

Leave a Reply