కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక నిర్ణయం

Share this:

బాపట్ల(V3News) 04-04-2022: బాపట్ల శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక నిర్ణయం అని అన్నారు.ఈ జిల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని వారం రోజులు పండుగ లా నిర్వహించాలని కోరారు.దశాబ్దాలుగా ప్రజల కలలను సాకారం చేస్తూ జిల్లాలను పునర్ వ్యవస్థీకరణ చేసి 26 జిల్లాలను ఏర్పాటు చేసిన సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. బాపట్ల జిల్లా ఏర్పాటు కు సంబంధించి చారిత్రక ప్రాధాన్యం ప్రజల సెంటిమెంట్ ను అన్నింటినీ గౌరవిస్తూ బాపట్ల ను జిల్లాగా చేయటమనేది నిజంగా హర్షించదగ్గ విషయం అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళిన ఘనత సిఎం వైయస్ జగన్ కే దక్కుతుందని మాట్లాడారు.స్థానికంగా బాపట్ల లో ఉండే విద్యా సంస్ధలు,స్వచ్ఛంద సంస్ధలు ప్రజాసంఘాలను జిల్లా వేడుకలలో భాగస్వాములు చేస్తూ పండుగ వాతావరణం తీసుకొని వచ్చి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాపట్ల జనం శ్రేయస్సు కోసమే రోడ్లు విస్తరణ అభివృద్ధి కోసం కృషిచేస్తున్నామని అన్నారు. అలాగే పోలేరమ్మ గుడి అమ్మవారి విషయంలో ఎలాంటి తప్పు జరగనివ్వమని,శాస్త్ర బద్ధంగా అమ్మవారి గుడిని పునర్ నిర్మిస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు.

Leave a Reply