భారీగా గంజాయి పట్టివేత

Share this:

భద్రాచలం(V3News) 29-8-2022: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంచెక్ పోస్టు తనిఖీల్లో భారీగా గంజాయి కా ర్లలో తరలిస్తున్న నేపథ్యంలోసోమారం పట్టుకున్న భద్రాచలం పోలీసులు. పట్టుకున్న గంజాయి విలువ ఒక కోటి 18 లక్షల 80 వేల రూపాయల విలువ గల గంజాయి సీజ్చేశారు. 2 ఖరీదయిన కార్ల లో సుమారు 594 కేజీల ఎండు గంజాయి సీజ్ చేసిన పట్టణ పోలీసులు ఆంధ్రా మోతుగుడెం నుండి భద్రాచలం మీదుగా చెన్నై కి తరలిస్తున్న ముఠా.సారపాక కి చెందిన అన్వేష్ అనే యువకుడు అరెస్ట్ చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపిన భద్రాచలం ఎఎస్పీ…రోహిత్ రాజ్..వివరాలు లోకి వెళితే ..ఈనెల 28 వ తేదీ సాయంత్రం పట్టణ పోలీసులు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా భద్రాచలం నుండి సారపాక వైపు కు ఇన్నోవా కారు,స్విఫ్ట్ డిజైర్ కార్లను తనిఖీలు చేయగా ఇద్దరు పారిపోగా,సారపాకకు చెందిన అన్వేష్ అనే యువకుడు పట్టుబడ్డాడు. అన్వేష్ తో పాటు కుమార్,ప్రవీణ్ అనే యువకులు కలిసి ఆంధ్రా లోని అల్లూరి జిల్లా మోతుగుడేం దగ్గరలోని సుకుమామిడి వద్ద రాము,మహేందర్ వద్ద నుండి గంజాయి తీసుకుని చెన్నై కి చెందిన జయకుమార్ అనే వ్యక్తికి అప్పగించడానికి గంజాయినీ తీసుకువెళుతున్నట్లు అన్వేష్ నేరము ఒప్పుకున్నట్లు ఎఎస్పీ రోహిత్ రాజ్ మీడియా కు వెల్లడించారు.
Rs.1,18,80,000 రూపాయల విలువ గల 594 కేజీల గంజాయి తో పాటు ఇన్నోవా కారు,స్విఫ్ట్ డిజైర్ కార్లను స్వాధీనమ్ చేసుకుని అన్వేష్ నీ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.తప్పించుకున్న 5గురు నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదుపులో ఉన్న నిందితుడుని రిమాండ్ కు తరలింపు.