జనసేన పార్టీలోకి భారీ చేరికలు

Share this:

అంబాజీపేట మండలం పుల్లేటికురు గ్రామంలో వైసీపీ టిడిపి పార్టీలకు చెందిన బిసి, ఎస్ సి సామాజిక వర్గాలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు శుక్రవారం జనసేన తీర్థం పుచ్చుకున్నారు,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం పుల్లేటికుర్రు లో మండల అధ్యక్షులు దొమ్మేటి సాయి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి ,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, మహాత్మా గాందీ విగ్రహాలను పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనంతరం ఏర్పాటు చేసిన సభలో కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు అంబేద్కర్ ఆశయాల నుండి పుట్టినవని, జనసేన పార్టీ వారసత్వ పునాదుల మీద ఏర్పడిన పార్టీ కాదు అని, మానవతావాదంతో ఏర్పడిన పార్టీ అని పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరామని తెలిపారు,
పితాని బాలకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎస్సీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల నుంచి బలమైన నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో కి రాబోతున్నారని ఆ దిశగా నా సాయి శక్తుల కృషి చేస్తానని వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ ఆశయాలను గ్రామాలలోకి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ మిగిలిన రాజకీయ పార్టీలతో పోల్చితే జనసేన పసిపాప లాంటిదని రాబోయే రోజుల్లో ఇంతింతై వటుడింతై అన్నట్టు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని వచ్చి తీరుతుందని, ఇటీవల కాలంలో కోనసీమ జిల్లాలో సంభవించిన వరదల వల్ల మునిగిన ఇళ్ళల్లో బురదను శుభ్రం చేసుకోవడానికి 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు అవుతుందని మన ముఖ్యమంత్రి మాత్రం బాధితులకు కేవలం రెండు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ మాత్రం వరద ముంపు గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేసి బాధితులకు అండగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply