సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు నిర్వహించుకుందాం- సర్పంచ్ వరలక్ష్మి సాగర్

Share this:

జాలపల్లి(V3News) 27-04-2022: తెలంగాణ ప్రభుత్వం అతిప్రతిష్టమకంగా చేపట్టబోతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామస్థులందరి సమన్వయంతో నిర్వహించుకుందామని సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ అన్నారు. జాలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో  ఏ పి ఎం ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం త్వరలో గ్రామంలో ఏర్పాటు కానున్న సందర్బంగా మహిళా సంఘాల ప్రతినిధులకు కొనుగోలు కేంద్ర నిర్వహణపై అవగాహనా కల్పించారు. అనంతరం నిర్వహణ  కమిటీ ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకార్యలు ఏర్పాటు చేస్తున్నట్లు ఏ పి ఎం తెలిపారు. ఎటువంటి గొడవలకు తవివ్వకుండా ఐకమత్యంతో కొనుగోలు కేంద్రం విజయవంతంగా నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరు తమ సహకారాలు అందించాలని సర్పంచ్ వరలక్ష్మి సాగర్ రైతులను కోరారు.ఈ సమావేశంలో ఎంపీటీసీ కళ్యాణి కమలాకర్ యాదవ్, గ్రామ మహిళా సంఘ ప్రతినిధులు, రైతులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు….

Leave a Reply