కొరటికల్ మరియు కొంపల్లి గ్రామాల్లో యాసంగి వరి కొనుగోలు కేంద్రాలు

Share this:

మునుగోడు(v3news) 26-04-2022: మునుగోడు మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొరటికల్ మరియు కొంపల్లి గ్రామాల్లో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మరియు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారి సహకారంతో యాసంగి వరి కొనుగోలు కేంద్రాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ మరియు మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి ముదిరాజ్ గారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…

👉 ప్రతి ఒక్క రైతు తాలు మట్టిపెళ్లలు లేకుండా వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి Rs.1960/- మద్దతు ధరను పొందాలని తెలిపారు.

👉 తెలంగాణ రైతుల ఆరాధ్యదైవం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు,

👉రైతులను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వానికి ధీటుగా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, దీనిని ప్రతి రైతు వినియోగించుకోవాలని వరి ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దని తెలియజేశారు,

👉ప్రతి రైతు కొనుగోలు సెంటరుకు తమ వ్యవసాయ, బ్యాంకు పాస్ బుక్కు ఆధార్కార్డుతో వచ్చినట్లయితే త్వరితగతిన కంప్యూటర్ లో ఎంటర్ చేసే అవకాశం ఉందని తెలిపారు, దానివల్ల బిల్లు తొందరగా పొందవచ్చును.

👉 కొనుగోలు కేంద్రాల్లోని అధికారులు రైతులకు సహకరించి , సీరియల్ ప్రకారం కొనుగోలు చేసి అవకతవకలు జరగకుండా ॥ ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వారితోపాటు ఎంపీపీ స్వామియాదవ్, ఎంపీడీవో యాకూబ్ నాయక్ , అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్ గౌడ్, ఏపి ఎం శ్రీదేవి, కొరటికల్ సర్పంచ్ వల్లూరి పద్మ లింగయ్య, ఎంపీటీసీ లక్ష్మమ్మ బీరయ్య, వనం నిర్మలా యాదయ్య, కొంపల్లి సర్పంచ్ జల వెంకటేశ్వర్లు, వెల్మకన్నె సర్పంచ్ చలమల్ల వెంకట్ రెడ్డి, చీకటిమామిడి సర్పంచ్ తాటికొండ సైదులు సంతోష, చల్మెడ సర్పంచ్ కర్నాటి మహేశ్వరి ఉశయ్య, టిడిపి మండల నాయకులు అప్పారావు, కొరటికల్ ఉప సర్పంచ్ ఎల్లంకి యాదగిరి, మార్కెట్ డైరక్టర్ మామిళ్ల వెంకట్ రెడ్డి, యెరుకొండ శ్రీను, బొడ్డుపల్లి వెంకన్నా పార్వతమ్మ, సిపిఐ నాయకులు పాండు, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు జంగిలి నాగరాజు, కొరటికల్ సెక్రటరీ శ్రీరామోజు వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply