తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకోవాలి-డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

Share this:

హనుమకొండ(V3News) 23-09-2022: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తన కార్యాలయంలో మాట్లాడుతూ, తెలంగాణ స్వరాష్ట్రం ఆవిర్భావానికి మూల కారణమైన తెలంగాణ ఉద్యమకారులు వారి కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సామాజిక భద్రత కల్పించకుండా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలన వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులందరికీ వెంటనే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారుల డిక్లరేషన్ ప్రకటించాలి.
ఉద్యమకారులకి పెన్షన్ ఉచిత బస్సు ట్రైన్ పాసులు ఆరోగ్య కాడులు ఇల్లు లేని వారికి 300 గజాల ఇంటి స్థలాన్ని వడ్డీ లేని రుణాలను సంక్షేమ పథకాలలో 20% కోటా కేటాయించాలి.ఉద్యమకారులందరినీ స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేయబడి మూడవ ఆవిర్భావ దినోత్సవం 30.2.2022 శుక్రవారం నాడున కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఉదయం 10:00 నుండి సదస్సు నిర్వహించ బోవడం అయినది. కావున తెలంగాణ ఉద్యమకారులు వారి కుటుంబాలు శ్రేయోభిలాషులు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలంగాణ ఉద్యమకారులకు మద్దతుగా నిలువ గలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాదాసి యాకూబ్, తిరుపతి, మల్లికార్జున్, సాయిలు, రాజమౌళి, సుంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు.