ప్రకృతిని దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి-ఎమ్మెల్యే అరూరి

Share this:

  • ఐనవోలు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే అరూరి…
  • పెన్షన్ గుర్తింపు కార్డులు, బతుకమ్మ చీరల పంపిణితో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే అరూరి….

ఐనవోలు(V3News) 27-09-2022: పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా సబండ వర్గాల సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రధాన లక్ష్యమని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.ఐనవోలు మండలం పున్నెల్, పంతిని, పెరుమాండ్లగూడెం, కక్కిరాలపల్లి, నందనం గ్రామాలలో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పర్యటించారు. ఆయా గ్రామాలకు చెందిన 685మంది నూతన పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు మరియు 6275మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం సుమారు 6కోట్లతో చేపట్టిన స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్, పల్లె ప్రకృతి వనాలు, గ్రామీణ క్రీడా మైదానాలు, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభమైన బతుకమ్మ పండుగ రోజున ప్రతి ఇంట ఆడపడుచులు కొత్త చీర ధరించి సంబురాలలో పాలుపంచుకోవాలనే సంకల్ఫంతో ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. ఐనవోలు మండలానికి సంబందించి 17వేల 047మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 24విభిన్న డిజైన్లు, 10రకాల రంగులు, 240రకాల సరికొత్త వెరైటీ చీరలను ఆడపడుచులకు అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. వృద్ధాప్య పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు,ఎంపిపి మార్నేని మధుమతి, జెడ్పీ కో ఆప్షన్ ఉస్మాన్ అలీ, మండల ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు