మంగళపల్లిలో జ్ఞానసరస్వతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

Share this:

నకిరేకల్(V3News) 31-03-2022: నకిరేకల్ మండలంలోని మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నకిరేకల్ మండల పరిషత్ అధ్యక్షులు బచుపల్లి శ్రీ దేవి గంగాధరరావు సహకారంతో ప్రతిష్ఠించిన జ్ఞాన సరస్వతి విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం గ్రామంలో భారీ ఎత్తున ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో జ్ఞాన సరస్వతి విగ్రహాన్ని ఎంపీపీ శ్రీదేవి గంగాధరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply