అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

Share this:

బాపట్ల( V3 News): బాపట్ల లో సాహితీ భారతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమం సభ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్ననూ మాతృ భాష మాధుర్యం పర భాషకు రాదని ఏ విషయం అయినా మాతృభాష లో బోధిస్తే అతి సునాయాసంగా అర్థమవుతుందని, కొన్ని భాషలు ఉపయోగించక పోవటం కారణంగా అంతర్ధానమై పోతున్నాయని, ఒక భాష అంతరిస్తే ఒక మహోన్నత చరిత్ర అంతరించి పోయినట్లే నని, ప్రతి భాషను పరిరక్షించడానికి ఐక్యరాజ్యసమితి యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీన “అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం”గా జరుపుకోవాలని 1999 నవంబరు 17వ తారీకున ప్రకటించింది అని, ప్రతి ఒక్కరూ తమ తమ మాతృభాష అభ్యున్నతికి తమ వంతు కృషి చేయాలని సాహితి భారతి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సభకు అధ్యక్షత వహించిన సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ తెలియజేశారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఇంగ్లీషు మాట్లాడటం గొప్పగా మాతృ భాషలో మాట్లాడటం నామోషీగా భావిస్తున్నారని ఉపాధి కోసం పర భాష నేర్చుకున్నా మాతృభాషను మరువకూడదని మాతృభాష మాధుర్యాన్ని భవిష్యత్ తరాలకు తెలియ చెప్పే బాధ్యత ప్రతి తల్లితండ్రి పై ఉందని సాహితి భారతి కోశాధికారి ఆదం షఫీ మనవి చేశారు .ఈ సభలో ఆదం షఫీ, మర్రి మాల్యాద్రి రావు, ఎం జాకబ్, పువ్వాడ వెంకటేశ్వర్లు, కస్తూరి శ్రీనివాస రావు ,బొడ్డుపల్లి శ్రీరామ చంద్ర మూర్తి , అవ్వారి వెంకటేశ్వర్లు , రెంటాల మురళి రాధాకృష్ణ మూర్తి తదితరులు పాల్గొని మాతృభాష గొప్పతనాన్ని వివరించారు.

Leave a Reply