బదిలీపై వెళుతున్నఐటీడీఏ ఏపీవో పవర్ అనురాధ

Share this:

ప్రభుత్వ ఉద్యోగి అన్న తర్వాత అధికారులకు కానీ, క్రింది స్థాయి సిబ్బందిలకు గాని, బదిలీలు నేటివి సహజమని కానీ ఒకే చోట అందరితో కుటుంబ సభ్యుల కలిసి, మెలసి పని చేసి బదిలీపై వెళ్లడం వలన బాధాకరంగా ఉండటం ప్రతి ఒక్కరికి సహజమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతం పో ట్రూ అన్నారు.
సోమవారం నాడు ఐటీడీఏ సమావేశ మందిరంలో బదిలీపై వెళుతున్న ఏపీవో పవర్ అనురాధను, యూనిట్ ఆఫీసర్లు మరియు ఐటిడి ఏ సిబ్బంది ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొని , ాలువాలతో సన్మానం నిర్వహించి నా అనంతరం ఆయన మాట్లాడుతూ ,ఈరోజు ప్రతి గ్రామం లోని ఇండ్లలో కానీ, పరిశ్రమలలో కానీ ,ప్రస్తుతం మన ఐటీడీఏ కార్యాలయంలో గాని ,కరెంటు లేనిదే క్షణమైనా ఉండలేమని ,కరెంట్ కి సంబంధించిన అధికారి మన కార్యాలయంలో ఉండి మనకు సేవలు చేయడమే కాక, తన యొక్క సేవలను ఏజెన్సీ ఏరియా పరిధిలోని గిరిజన గ్రామాలలో ఎంతో మర్యాదగా, ఓపికగా గిరిజన ప్రజలకు సంతృప్తికరంగా సమాధానం ఇచ్చి వారికి ఎనలేని సేవలు చేసిన ఏపీ ఓ పవర్ అనురాధ అందరి మదిలో ఆమె యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. బదిలీలు అనేవి ప్రతి ఉద్యోగి కి సహజమని, అయినా ఇంతకాలం అందరితో కలగలుపుగా ఉండి తన ఉద్యోగ ధర్మాన్ని ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వర్తించి అధికారుల ప్రశంసలు పొంది, బదిలీపై వెళ్లడం బదిలీ అయిన ఆమెకు గాని ఆమెతో పని చేసిన సిబ్బందికి గాని బాధాకరంగా ఉండొచ్చు, కానీ ఆమె ఎంత దూరం వెళ్లడం లేదని ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిరకు మాత్రమే వెళుతుందని, అయినా ఐటీడీఏ కార్యాలయంలో అవసరమైతే ఆమె యొక్క సేవలను తప్పనిసరిగా ఉపయోగించుకుంటామని అన్నారు. ఏపీవో పవర్ అనురాధ పని పట్ల ఎంతో ఓపిక శ్రద్ధతో ఆమె యొక్క విధులు ఎటువంటి మాట రాకుండా పనిచేశారని, కానీ ఆమె యొక్క సేవలు ఈ కార్యాలయము వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనులు ఎంతో సంతృప్తి చెందేవారని, ప్రతి గిరిజన గ్రామంలో ఆమె యొక్క పేరు ఎప్పుడు మారు మ్రోగుతూ ఉంటుందని ,ఎందుకంటే ఆమె పని చేసేదే కరెంటు సంబంధించిన వృత్తి అని ప్రతి గిరిజన రైతు మొదలుకొని గిరిజన గ్రామాల ప్రజలు ఆమెను ఒక దేవతల కొలుస్తారని ఆయన అన్నారు.
అనంతరం ఐటి డి ఎ కార్యాలయంలోని యూనిట్ అధికారులు, సిబ్బంది శాలువాలతో సత్కరించి ఆమె యొక్క పనితీరును ప్రశంసించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ (జనరల్ )డేవిడ్ రాజ్, ఎస్ఓ సురేష్ బాబు ,డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ ,మరియు ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాల పర్యవేక్షకులు ,సిబ్బంది ,నాలుగో తరగతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.