బస్తి బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ లో పర్యటించిన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

Share this:

ఆమనగల్(23-04-2022): రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ లోని వివిధ వార్డుల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటించి కాలనీ లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వివిధ శాఖల అధికారులతో కలిసి పుర పాలక సంఘ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కొరకై రంగారెడ్డి జిల్లాలో 9 మున్సిపాలిటీలను ఎంపిక చేశారని అందులో ఆమనగల్ మున్సిపాలిటీ కూడా ఎన్నికయింది అని దీనికిగాను 32 కోట్ల నిధులను మున్సిపాలిటీ అభివృద్ధి కొరకై మంజూరు చేశారని వాటిని పట్టణ అభివృద్ధికి వినియోగించాలని మున్సిపాలిటీ కమిషనర్ కు సూచించారు. ఆ తర్వాత స్థానిక జామా మసీదులో రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లింలకు కెసిఆర్ దుస్తుల కిట్ల ను ముస్లింలకు అందజేశారు అదేవిధంగా స్థానిక రైతు వేదిక భవనం లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 30 మంది లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, జెడ్ పి టి సి అనురాధ పత్య నాయక్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్,రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, ఇరిగేషన్ ,ఇంజనీరింగ్, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply