వివేకానంద గురుకుల విద్యాలయం-జంగేడు, పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

Share this:

జయశంకర్ భూపాలపల్లి(V3News)25-04-2022: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం వెంకటేశ్వర మిని ఫంక్షన్ హాల్ లో SSC-1994-95 బ్యాచ్ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం అంగ రంగ వైభవంగా జరిగింది.మొత్తం 107 విద్యార్ధుల లో 100 మంది విద్యార్థులు హాజరై వారి పాత జ్ఞాపకాలు, గురువులు నేర్పిన క్రమశిక్షణ, విద్యాబోధన,వారు వివిధ రంగాలలో అభివృద్ధి చెందిన అనుభవాలను ఒకరికొకరు పంచుకుని, ఉపాద్యాయుల మన్ననలు పొందారు, మధ్యలో మానసిక ఉల్లాసం కోసం కళాబృందం పాటలు పాడుతూ ఆహుతులను ఉత్తేజ పరిచారు.భోజన విరామం తర్వాత ఉపాధ్యాయులను శాలువా,ముమెంటోలతో సన్మానించారు,అనంతరం ఉపాద్యాయులు మాట్లాడుతూ ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ అభివృద్ధి చేసుకోవడం వల్ల విజయం వరిస్తుందని,SSC పాసై 27 సంవత్సరాలైన గురువులను,పాఠశాలను మరిచిపోకుండా, వివిధ రంగాల్లో స్థిరపడిన ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించినందుకు పూర్వ విద్యార్ధులను మనస్పూర్తిగా అభినందించారు.ఈ కార్యక్రమంలో HM దుగ్యాల నర్సింగరావు, ఉపాద్యాయులు కార్యక్రమ నిర్వాహకులు రాజునాయక్, గోపికృష్ణ, రఘుపతి, రాజేందర్ రెడ్డి, కొండ సుధాకర్, అనిల్, లింగంపల్లి రాజేశ్వరరావు, మీడియా ప్రతినిధులు గోగు రామస్వామి, శ్రీనివాస్, పూర్వ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply