టీఆరెఎస్ పార్టీలోకి చేరికలు….

Share this:

హాసన్ పర్తి (V3 News) 14-07-2022:హాసన్ పర్తి మండలం అర్వపల్లి గ్రామం నుండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 100మంది నాయకులు, కార్యకర్తలు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారి సమక్షంలో టీఆరెఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు తనను నమ్మి వచ్చిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ చేరికలు తెరాస ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు నిదర్శనమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బండి రజిని కుమార్, పీఏసీఎస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, మండల రైతు బందు సమితి అధ్యక్షులు అంచూరి విజయ్, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్, ఉప సర్పంచ్ గట్టు శివ కుమార్, తగరం చిరంజీవి, బీసీ సెల్ అధ్యక్షలు రామ్ లక్ష్మణ్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply