టీఆర్ఎస్ పార్టీలో చేరికలు…

Share this:

తాండూర్ మండలం కోట బసుపల్లి , యలాల మండలం అగ్గానుర్ మరియు కోటపల్లి మండల్ నుండి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు 150 మంది క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా , ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి,వైస్ ఎంపీపీ రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తాండూర్ మండల్ పార్టీ అధ్యక్షుడు రామ్ దాస్, శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు, ఉమాశంకర్ , మహేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాండు, రామచందర్, ఎంపిటిసి గరివప్ప, వెంకటయ్య, సాయిలు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.