55 వ డివిజన్లో భారీగా టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు..ఎమ్మెల్యే ఆరూరి

Share this:

వరంగల్( V3 News) 19-04-2022:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 55 వ డివిజన్ పరిధిలోని భీమారం,కోమటిపల్లి, గ్రామాలకు చెందిన కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీల నుండి కార్యకర్తలు సోమవారం టిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే ఆరూరి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.తెరాస ల్లో చేరిన వారిలో బిజెపి సీనియర్ నాయకులు రాయికంటి సుధాకర్, ఉప్పు రమేష్,భాస్కర్,బుచ్చయ్య,సంతోష్,కమలాకర్ ,కాంగ్రెస్ నుండి దామెర కళావతి,అమృత,సందెల సారయ్య,శైలజ, వార్డు మెంబర్ కళావతి తదితరులు వున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.ప్రజా సంక్షేమమే ఎజెండాగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు,డివిజన్ అధ్యక్షులు అటికం రవీందర్ గౌడ్,నమిండ్ల రవీందర్,రాయికంటిసురేష్,సంగాల విక్టరి బాబు,ముఖ్య నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply