కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి

Share this:

వర్దన్నపేట(V3News) 01-09-2022: వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని వరంగల్, కాజీపేట, హన్మకొండ మండలాలకు చెందిన 45మంది కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 45లక్షల 05వేల 220రూపాయల విలువగల చెక్కులను, 31మంది ముఖ్య మంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 09లక్షల 60వేల రూపాయల విలువగల చెక్కులను తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పంపిణీ చేశారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.