కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బొల్లం

Share this:

మునగాల(V3News): పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం మునగాల మండల కేంద్రంలోని వాసవి భవన్ లో ఆయా గ్రామాల చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. నిరుపేద ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో అండగా నిలుస్తుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదని, పేద ప్రజల కష్టాలు తెలిసిన కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అజయ్ కుమార్,,మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, సొసైటీ చైర్మన్ లు కందిబండ సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ ఉపేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply