అన్ని వర్గాల ఆరాధ్యుడు బాబా సాహెబ్అంబేద్కర్

Share this:

మహానియూడుని ఆశయాలను సాదించాలి దళిత బంధు తో పేదల ఆర్ధిక బివృద్ధి -సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

కమాన్ పూర్(V3News)01-05-2022: కమాన్ పూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్దా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పేర్కొన్నారు, ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, విగ్రహాన్ని జడ్పీ చైర్మన్ పుట్ట మధు తో కలసి ఆయన ఆవిష్కరించారు, అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లా డుతూ అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. కాగా మాజీ మంత్రి మంథనిఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ వివేక్వెంకటస్వామి వేర్వేరుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం, సుమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు రెంజర్ల రాజేశ్, సర్పంచి నీలం సరిత, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్రావు, అంబేడ్కర్ విగ్రహాల కమిటీ నియోజక వర్గ కన్వీనర్ తగరం శంకర్లాల్, విగ్రహ కమిటీ ఛైర్మన్ కుక్క చంద్రమౌళి, ప్రధానకార్ రాజయ్య పాల్గొన్నారు.

Leave a Reply