కరాటే లో పేటకు పేరు ప్రతిష్టలు తేవాలి : సీఐ ఆంజనేయులు

Share this:

– 37 మంది కరాటే విద్యార్థులకు బెల్టులు సర్టిఫికెట్లు ప్రదానం

విద్యార్థులు కరాటే నేర్చుకోవడం తో ఆత్మస్థైర్యం పెంపొందడమే కాకుండా ఆత్మరక్షణకు పాటుపడుతుందని సూర్యాపేట పట్టణ సీఐ ఆంజనేయులు అన్నారు. సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ ఆధ్వర్యంలో ఫౌండర్ జల్లల శ్రీనివాస్ పర్యవేక్షణలో సీనియర్ కరాటే మాస్టర్ జె వి రమణచే కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షల్లో విజేతలైన విద్యార్థులకు శుక్రవారం రాత్రి స్థానిక పబ్లిక్ ఆడిటోరియంలో బెల్టులు సర్టిఫికెట్లు ప్రదానం చేసి మాట్లాడారు.
కరాటే లో సూర్యాపేట విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి బంగారు వెండి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. ముందు ముందు మరిన్ని పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చి పట్టణానికి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.

కరాటే శిక్షణ ఇవ్వడంతో పాటు వారిలోని ప్రతిభకు పదును పెడుతున్న కరాటే మాస్టర్ రమణను అభినందించారు.
అనంతరం ఏడుగురికి ఆరెంజ్, 15 మంది కి ఎల్లో, 15మంది కి బ్లూ బెల్టులతో పాటు సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ జే.వి. రమణ, డీజే సౌండ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చీకూరి అశోక్, కరాటే మాస్టర్ సాయికిరణ్, నిఖిల్, , నందన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply