రాజకీయ ప్రాబల్యం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మిగిల్చిన చీకటి రోజు నేడు — కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..!

Share this:

1975 వ సంవత్సరం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి స్వార్థ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25 తేదీ రోజును ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి ఆద్వర్యంలో ఎల్బీనగర్ రింగ్ రోడ్ సమీపంలో నియోజకవర్గ కార్పొరేటర్లు మరియు మన్సూరాబాద్ డివిజన్ *కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చైనా, పాకిస్తాన్ దేశాలతో యుద్ధం సమయంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారని ఆ తరువాత అంతర్గత అలజడి పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపించి, పత్రికల నియంత్రణ, సామాన్య ప్రజలు ఆ రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారని అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కూడా నియంత్రణ పాలన ప్రజలు చూస్తున్నారని కుటుంబ వారసత్వ పాలన ఏ రూపంలో ఉన్న ప్రజాస్వామ్యానికి ప్రమాదమేనని తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో కేవలం కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్యమే నడుస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, నాయకులు బిజెపి మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply