హిందు వాహిని ఆధ్వర్యంలో కృష్ణాష్టమి

Share this:

ముధోల్(V3News) 20-08-2022: ముధోల్ మండల కేంద్రంలో హిందూవాహిని అద్వర్యంలో శుక్రవారం రాత్రి శ్రీ కృష్ణ జన్మాష్టమి ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నిర్మల్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు పవార్ రామారావు పటేల్ తో పాటు నాయకులు తాటివార్ రమేష్, పోతన్న యాదవ్, ,శ్రీనివాస్, అంజిగౌడ్, బీడీసి అధ్యక్షులు బాబు,గ్రామపెద్దలు, వార్డ్ మెంబర్లు తదితరులు పాలుగొన్నారు.కబడ్డీ పోటీల్లో ప్రథమ,ద్వితీయ స్థానాల్లో నిలిచిన టీమ్ లకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకై శ్రీ కృష్ణ భగవానుడు మనతో పాటే ఉన్నాడని, భగవాన్ నామస్మరణ ఎప్పుడు మర్చిపోవద్దని అన్నారు. ప్రతీ ఇంట్లో భగవద్గీత పారాయణం జరగాలని,భగవంతునిపైన విశ్వాసం, మనపైన మనకు ఆత్మవిశ్వాసం ఉండాలంటే పేర్కొన్నారు. స్థానిక రవీంద్ర ఉన్నత పాఠశాల శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా కట్టుకున్నాయి. హిందువని ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు తో పాటు ప్రజాప్రతినిధులు సన్మానించి శ్రీకృష్ణుని చిత్రపటాన్నించారు.

Leave a Reply