ఆత్మ రక్షణకు కుంగ్ ఫు చాలా ముఖ్యం

Share this:

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

ఆత్మ రక్షణకు కుంగ్ ఫు చాలా ముఖ్యమని అన్నారు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో న్యూ పవర్ కుంగ్ పు అకాడమీ బాలరాజ్ మాస్టర్,అహ్మద్ ఖాన్ మాస్టర్ల ఆధ్వర్యంలో కుంగు పులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్ట్ ప్రధానోత్సవాలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.పట్టణంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల మానసిక శారీరక దృఢత్వానికి కుంగ్ ఫు మరియు ఆడపిల్లల ఆత్మ రక్షణకై సహాయ పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, టిఆర్ఎస్ మైనార్టీ నాయకులు’ కౌన్సిలర్లు పావని నరసింహ, పిల్లి శారద శేఖర్, జూపల్లి శంకర్, పిఎసిఎస్ ఒకటో వార్డ్ డైరెక్టర్ నందిగామ శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు శరత్, గుడ్డు యాదవ్, శ్రీకాంత్, మాస్టర్లు,షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అధ్యక్షులు రాజు గౌడ్, ఉపాధ్యక్షులు కబీర్, జనరల్ సెక్రటరీ అజ్ మత్, జయద్,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు