మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్స్

Share this:

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో భవాని ఫంక్షన్ హాల్ లో గత ఇరవైఐదు రోజుల నుండి జరుగుతున్న ఉచిత కోచింగ్ సెంటర్ లో 250 మంది విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు విడుదల చేసిన ఉద్యోగులలో మునుగోడు నియోజకవర్గం నుండే ఎక్కువ ఉద్యోగాలు సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నాకు గిఫ్ట్ గా ఇవ్వాలని అన్నారు. దీనికోసం ఇంకా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుండిచేస్తానని తెలిపారు.ఈ నిర్వహణకుసుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు.ఈ విద్యార్థులు అందరూ ఉద్యోగాలు సాధిస్తే నాకు అదే సంతోషం అని అన్నారు

Leave a Reply