కెవీపీస్ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 127వ జయంతి

Share this:

రేపల్లె (V3news) 28-09-2022: రేపల్లె టౌన్ గుర్రం జాషువా 127వ జయంతి రేపల్లెలో కెవీపీస్ ఆధ్వర్యంలో జాషువా చిత్రపటానికి పూలమాలవేసి నివాళుల తెలిపారు..సిఐటియు జిల్లా అధ్యక్షులు సీహెచ్. మణిలాల్ మాట్లాడుతూ ముందుగా సీఐటీయూ కార్యాలయం కొరటాల మిట్టింగ్ హాల్లో జాషువా చిత్రపటానికి కెవిపీస్ నాయకులు సీహెచ్. అగస్టీన్ పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం మణిలాల్ మాట్లాడుతూ జాషువా కవిత్వం సమాజంలో అంటరాని తనం,కుల సమస్యలుకి ఎదురునిలబడినా కవిత్వంగా ముందు పీఠనా నిలబడింది. జాషువా ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతాల్లో జన్మించి తను చిన్నతనంలో ఎదురుకొన్నా అంటారనితనం వల్ల సమాజంలో గబ్బిలం అనే దానిని ఉంచరించి సూటిగా చెప్పాడు.కులం,మతం, జాతి, ప్రాంతం,దేశాల హద్దులు తనకు లేవని ,తాను విశ్వ నరుడనని ప్రకటించుకున్న మహాకవి గుర్రం జాషువా అన్నారు. జాషువా బాల్యంలో ఎదుర్కొన్న వివక్షతను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని నిలబడ్డారని అన్నారు. తన కవిత్వంతో వర్ణాశ్రమ ధర్మాలను చీల్చి చెండాడరని అన్నారు.సత్యహరిచంద్ర నాటకంలో గుర్రం జాషువా రచించిన కాటిసీను విని కంట నీరు పెట్టని వారు లేరని అన్నారు.గుర్రం జాషువా కు మహాకవి,నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, కవి సార్వభౌమ, కళా (పపూర్ణ, కవి విశారద, మధురకవి, శ్రీనాథ, కవి దిగ్గజ, కవి సింహా, ఇంకా లెక్క లేనన్ని బిరుదులు, సత్కారాలు పొందారు.పండితులకి పరిమితమైన గౌరవ గండపెండెరాన్ని తాను గురుతుల్యులుగా భావించే తిరుపతి వెంకట కవుల సమక్షంలో పొందారని అన్నారు.గుర్రం జాషువా పుట్టి 127 సంవత్సరా లు అయినప్పటికీ ఇప్పటికీ ప్రజల మదిలో చిరస్మరణీయుడుగా నిలిచారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్వాత్రంత్ర సమర యోధుడు భగత్ సింగ్ 115 వ జయంతిని పురస్కరించుకుని భగత్ సింగ్ కి నివాళులు తెలిపారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్, సీఐటీయూ,ఎస్ఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల నాయకులు బి. నాగరాజు,కెవి లక్ష్మణరావు,ఏం. సూర్యప్రకాష్,వై.కిషోర్,కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు