పోచంపల్లి శివారులోని భూములకు పట్టాలి ఇవ్వాలి-అదివాసి సంఘాలు

Share this:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పోచంపల్లి శివారులో గల 610 ఎకరాల భూమి 1995 సంవత్సరం నుండి కాస్తూ చేస్తూ కబ్జాలో ఉన్న మరిపల్లి, దంతేలపల్లి, బొప్పారం గ్రామాల ఆదివాసి దళిత నిరుపేద రైతులకు పట్టాలు ఇవ్వాలని,ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని,నినాదాలు చేస్తూ అదివాసి సంఘాల ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి తహశీల్దార్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి తహశీల్దార్ గార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ… పోచంపల్లి శివారులో ఉన్న భూమి రికార్డులు పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని తహశీల్దార్ ను డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో నాయక పోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గొట్టం భూమయ్య,ప్రధాన కార్యదర్శి గుంటి రమేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామచందర్, జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంకొండ పోచయ్య, మంగయ్య సడవలి, కొత్తపల్లి లక్ష్మి స్వామి, కాల్వపల్లి సుధాకర్, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి రామినేని సురేందర్ రామినేని వెంకటరాజు, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ జిల్లా సహాయ కార్యదర్శి దయ్యం వినోద్ జిల్లా నాయకులు పోలం చిన్న రాజేందర్, గాదె రవీందర్, ప్రతాపగిరి ఉప సర్పంచ్ మెండ. క్రాంతి కుమార్, మరియు 300 మంది రైతులు పాల్గొన్నారు.