పెద్దంపేట గ్రామ శివారులో చిరుతపులి సంచారం,అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ- అటవీశాఖ అధికారులు…

Share this:

పెద్దపల్లి (V3News) 08-10-2022: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధి అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని ఎస్టీ కాలనీ శివారులో చిరుత పులి సంచరిస్తుంది. ఈరోజు ఉదయం పశువుల కాపర్లు తమ పశువుల మధ్యలో చిరుత వెళ్లినట్లు గుర్తించారు. అప్రమత్తమైన గ్రామ ప్రజాప్రతినిధులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రామగుండం ఫారెస్ట్ అధికారి రహమతుల్లా తన సిబ్బందితో ఎస్టీ కాలనీలో పరిశీలించారు. చిరుతపులి అడుగులను గుర్తించి, నిర్ధారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చిరుతపులి ఈ ప్రాంతంలో సంచరిస్తుందని, పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒంటరిగా బహిరంగ ప్రదేశాలలో తిరగవద్దని సూచించారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో పశువులను మేపకుండా ఉండాలని పేర్కొన్నారు.