గోదావరిఖనిలో సింగరేణి కార్మికుని దారుణ హత్య…
మళ్లీ మొదలైన గన్ కల్చర్…
రంగంలోకి దిగిన పోలీసులు…

Share this:

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు గంగానగర్ కు చెందిన కొరికొప్పుల రాజేందర్ అనే సింగరేణి కార్మికుని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత తుపాకితో కాల్చి దారుణంగా హత్య చేశారు. నిద్ర మత్తులో ఉన్న రాజేందర్ ను శాశ్వతంగా మృత్యువు ఒడిలోకి పంపించేశారు. మంచిర్యాల జిల్లా ఆర్కె న్యూటెక్ బొగ్గు గని లో జనరల్ మజ్దురుగా పనిచేసే రాజేందర్ నిత్యం అక్కడికి వెళ్లి గోదావరిఖని గంగానగర్ లోని తన సొంత ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే నిన్న మధ్యాహ్నం డ్యూటీ కి వెళ్లి అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలతో ఉండే రాజేందర్ ను నిద్రమత్తులో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపి పరారయ్యారు. అయితే సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా కొంతమంది రాత్రి రెండున్నర తర్వాత వచ్చి పోయినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డిసిపి రూపేష్, గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్, వన్ టౌన్ పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డీసీపీ మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులు గన్ తో కాల్చి చంపారని తెలిపారు. సంఘటన సంబంధించిన కారణాలు పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, సీసీ ఫుటేజీ ఆధారంగా ఎంక్వయిరీ చేస్తున్నామన్నారు. అలాగే ఫోరెన్సిక్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా పరిశీలిస్తున్నామని తెలిపారు.

Leave a Reply