తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం

Share this:

తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు తెలకపల్లి నెహ్రు చౌరస్తా నందు మండల కేంద్రంలోని పాఠశాలకు KK రెడ్డి , సిద్ధార్థ మోడల్ స్కూల్ , శాంతినికేతన విద్యాలయం , ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇతర పాఠశాల విద్యార్థులు , తెలకపల్లి మేజర్ గ్రామపంచాయతీ Eo భాస్కర్ గారు, సర్పంచ్ సురేఖ బలగౌడ్ , MEO చందు నాయక్ ,MRO శ్రీనివాసులు, Si ప్రదీప్ గారు , రైతు సమితి అధ్యక్షులు మాధవ రెడ్డి ,ఎంపీపీ కొమ్ము మధు , సింగెల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీటీసీ రమేష్ ,కాంగ్రెస్ పార్టీ నాయకుల శ్రీను ,బాలగౌడ్ ,స్వామి ,రాముడు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బిజెపి పార్టీ నాయకులు రాజేష్ గౌడ్ , ఎత్తపు రవి ,అశోక్ ఇతర నాయకులు శ్రీకాంత్ , రాజేష్ ,రాజు ,శివ పట్టణ యువకులు , చిరు వ్యాపారులు , వాహన దారులు అందరూ పాల్గొని ప్రజలు ఎక్కడున్నవారు అక్కడే నిలబడి ‘జనగణమన’ ఆలపించారు.

గద్వాల మున్సిపాలిటీ చౌరస్తాలో పాఠశాల విద్యార్థుల సమూహంతో కలిసి జాతీయగీతం ఆలపించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి,ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో 11:30 కి జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

స్వాతంత్ర వజ్రోత్సవలలో భాగంగా ఈరోజు మీర్పేట్ పోలీస్ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన ఈరోజు 11:30 నిమిషాలకు మీర్పేట్ చౌరస్తాలో వివిధ విద్య సంస్థల కు చెందిన విద్యార్థులు దాదాపుగా ఒక వెయ్యి మంది విద్యార్థులు పాల్గొని సామూహిక గీతాలాపన చేయడం జరిగింది.

కోఠి ఉమెన్స్ కాలేజీలో మూడు వేల మంది తో సామూహిక జాతీయ గీతాలపన పాల్గొన్న ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ , సుల్తాన్ బజార్ ఏసీపీ , సుల్తాన్ బజార్ పోలీసులు , విద్యార్థినిలు , మహిళ వైద్యులు , ncc విద్యార్థినులు , నర్సులు , బ్యాంక్ ఉద్యోగిణిలు , పోలీసులు పాల్గొన్నారు

నిర్మాల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో 11.30 గంటలకు తెలంగాణ తల్లి చౌక్ లో ట్రాఫిక్ అపి మరియు కూడళ్లలో నిమిషంపాటు జాతీయ గీతాలాపన కార్యక్రమం జరిగింది….

Leave a Reply