మే డే సందర్భంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వాగ్వాదం

Share this:

నకిరేకల్ సెంటర్ లో మే డే సందర్భంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఇన్ని రోజులు అంతర్గతంగా రగులుతున్న వివాదాలు కాస్త రచ్చకెక్కింది… జెండా ఆవిష్కరణ విషయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయుల మధ్య వాగ్వాదం.. తోపులాట చోటు చేసుకుంది ..మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం తో.. గొడవ తాత్కాలికంగా సద్దుమణిగింది… అయితే మేడే సందర్భంగా నకిరేకల్ సెంటర్ లో ఎమ్మెల్యే పేరుతో ఉన్న జెండా దిమ్మె వదిలిపెట్టి వీరేశం వర్గీయులు మరొక జెండా దిమ్మె సిద్ధం చేసుకున్నారు.. అయితే ఎమ్మెల్యే వర్గీయులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేరుతో ఉన్న జెండా ఆవిష్కరించడం తో పాటు.. వీరేశం వర్గీయులు సిద్ధం చేసుకున్న జెండాను కూడా వారి అనుమతి లేకుండా ఆవిష్కరించారు.. వీరేశం వర్గీయులు గొడవలు వద్దు అనే ఉద్దేశంతో మళ్లీ మరొక జెండా దిమ్మెను సిద్ధం చేసుకునే క్రమంలో టిఆర్ఎస్ జండా ఎగురవేయడానికి మీరు ఎవరు అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గీయులు.. జెండా ఆవిష్కరణ కోసం సిద్ధం చేస్తున్న వీరేశం వర్గీయులను జెండా ఎగరవేయడానికి వీలులేదు అని వారి వద్ద ఉన్న జెండా కర్ర లాక్కొని వెళ్ళారు వారిని అడ్డుకోవటంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తి తోపులాటకు దారితీసింది.. పోలీసుల జోక్యం వేసుకొని.. వేముల వీరేశం వర్గీయులను మాత్రమే అదుపులోకి తీసుకోవడంతో వేముల వీరేశం వర్గీయులు పోలీస్ స్టేషన్లు ఆందోళనకు దిగారు.. అసలు గొడవకు కారణమైన చిరుమర్తి లింగయ్య వర్గీయులను అరెస్టు ఎందుకు చేయలేదని పోలీస్ స్టేషన్లో వీరేశం వర్గీయులు ధర్నాకు దిగారు… ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులకు జెండా ఆవిష్కరణ విషయంలో వివాదం జరగకముందే ముందస్తుగా నల్గొండ డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి నకిరేకల్ పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం తో పలు అనుమానాలకు తావిస్తోంది

Leave a Reply