రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 136వ మేడే వేడుకలు

Share this:

రామగుండం(V3News) 01-05-2022: పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 136వ మేడే వేడుకలు కార్మిక వర్గం ఘనంగా నిర్వహించారు. సింగరేణి బొగ్గుగనుల పై జాతీయ కార్మిక సంఘాలు, వామపక్ష కార్మిక సంఘాల తో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేసి చికాగో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్నా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక వర్గం కలిసికట్టుగా ఉద్యమించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. చికాగో అమరవీరుల త్యాగ ఫలితంగా ఎరపడిన 8గంటల పని దినాన్ని కార్పొరేట్ శక్తులు అమలు చేయడం లేదని సమాన పనికి సమాన వేతనం అందేలా అన్ని కార్మిక సంఘాలు కలిసి కట్టుగా పోరాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటుపరం చేస్తుందని,ఇందులో భాగంగానే సింగరేణి బొగ్గుగనుల ప్రవేటికరణకు పూనుకుందన్నారు, టిబిజికెఎస్ పక్షన అన్ని సంఘాలను కలుపుకుని మూడు రోజుల సమ్మె చేయడం తో టెండర్ వేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదని , ఇది కార్మికుల విజయమని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆన్నారు.

Leave a Reply