చిన్నారి అదృశ్యం ఘటనను 36 గంటల సమయంలోనే చేధించిన పోలీసులు..

Share this:

కుప్పం(V3News)19-04-2022: కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం మండలం కంగుంది మండలానికి చెందిన మణి కుమార్తె జోషిక 4 సంవత్సరాలు.. రెండు రోజుల నుండి కనిపించడం లేదు అని జొషిక తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ రీషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పలమనేరు డిఎస్పీ గంగయ్య పర్యవేక్షణలో ఈ కేసును దర్యాప్తు చెప్పట్టినట్లు కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు.. గత రెండు రోజులుగా చిన్నారి జోషిక కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి..అయితే ఈరోజు పొద్దున్న అంభాపురం అటవి ప్రాంతంలో చిన్నారికి కనుగొన్నట్లు కుప్పం అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు..

Leave a Reply