MNJ క్యాన్సర్ ఆస్పత్రికి 30 వేల రూపాయల విలువైన హీమో క్యూ HB -301 మిషన్ విరాళం

Share this:

నాంపల్లిలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రికి 30 వేల రూపాయల విలువైన హీమో క్యూ HB -301 మిషన్‌ను ఆసుపత్రి డైరెక్టర్‌ , మరియు రేడియాలజీ విభాగాధిపతి డా. జయలత సమక్షంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సత్యం, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎవరెస్టు వారి సంయుక్త ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. రక్తంలోని హీమో గ్లోబీన్‌ పర్సటేజ్‌ ను అప్పటికప్పుడే తెలుసుకునేందుకు ఈ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి రోజు వేలాదిగా వస్తున్న క్యాన్సర్ రోగులకు ఈ మిషన్ ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుందని, ఎంతో విలువైన ఈ పరికరాన్ని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సత్యం, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎవరెస్టు వారు విశాల హృదయంతో తమ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డా. కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. రాబోయో కాలంలో ఆరోగ్యానికి సంబంధించి లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సత్యం, MNJ క్యాన్సర్ ఆస్పత్రి తో కలిసి భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలూరి రఘు, మధుసూదన్ రెడ్డి, కాచం ఏకసాయి , నంగునూరి రమేశ్, కొత్తూరి వీరేందర్ , చింత ఎనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply