మదర్‌ థెరిసా జయంతి సందర్భంగా V3 న్యూస్‌ ఛానల్‌ ప్రత్యేక కథనం….

Share this:

MOTHER TERESA

మదర్ థెరిసా పేరు మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పరాయి దేశంలో పుట్టి మన దేశానికి విచ్చేసి ఎందరో అభాగ్యులను తన అక్కున చేర్చుకుని గొప్ప మనసున్న తల్లిగా వారిని ఆదరించింది.ఆఖరికి తన జీవితాన్ని వారి సేవ కోసం పణంగా పెట్టి ఒకానొక సమయంలో యాచన కూడా చేసిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.

మదర్ థెరిసా. అసలు పేరు ఆగ్నీస్ గోక్షా బొజాకు. అల్బేనియా దేశంలో జన్మించిన ఆమె రోమన్ క్యాథలిక్ తెగకు చెందినవారు. ఆమె 1910, ఆగష్టు 26వ తేదీన ఉస్కుబ్ ప్రాంతంలోని (స్కోబ్జే) ఒట్టోమన్ సామ్రాజ్యంలో జన్మించారు.మదర్ థెరిసా పేరు మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పరాయి దేశంలో పుట్టి మన దేశానికి విచ్చేసి ఎందరో అభాగ్యులను తన అక్కున చేర్చుకుని గొప్ప మనసున్న తల్లిగా వారిని ఆదరించింది.
ఆఖరికి తన జీవితాన్ని వారి సేవ కోసం పణంగా పెట్టి ఒకానొక సమయంలో యాచన కూడా చేసిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.
మదర్ థెరిసా. అసలు పేరు ఆగ్నీస్ గోక్షా బొజాకు. అల్బేనియా దేశంలో జన్మించిన ఆమె రోమన్ క్యాథలిక్ తెగకు చెందినవారు. ఆమె 1910, ఆగష్టు 26వ తేదీన ఉస్కుబ్ ప్రాంతంలోని (స్కోబ్జే) ఒట్టోమన్ సామ్రాజ్యంలో జన్మించారు.
బాల్యంలో జోన్ గ్రాఫ్ఫ్ క్లూకాస్ చేత రాయబడిన ఆమె జీవిత చరిత్ర ప్రకారం థెరిసా ఎక్కువగా మతప్రబోధనలకు, జీవిత చరిత్ర కథలకు ఎక్కువగా ఆకర్షితులయ్యేవారట. 12 ఏళ్ళ వయసులోనే జీవితాన్ని మతానికి అంకితం చేయాలని భావించిన థెరిసా, 18 ఏళ్ళ వయసు వచ్చే సరికి తన ఇంటిని వదిలి సిస్టర్స్ ఆఫ్ లోరెటో అనే మత ప్రచారకులసంఘంలో చేరి అక్కడి నుండి పూర్తిగా తన జీవితాన్ని సేవకే అంకితం చేసారు.
అనంతరం డార్జిలింగ్ లో 1931 మే 24న సన్యాసినిగా మారారు. మత ప్రచారకుల సంఘం సయింట్ అయిన తెరేసే డి లిసే పేరు ఆచరించేలా తన పేరును థెరిసాగా మార్చుకున్నారు. ఆ తరువాత 1937లో కోల్‌కతా లోని లోరెటో కాన్వెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరారు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పేద వారిని, అన్నార్తులను చూసి ఆమె మనసు ఎంతో చలించిపోయింది.

1943లో ఏర్పడిన కరువు పరిస్థితులు కలకత్తా ప్రజల్లో ఎందరినో మరింత పేదవారిని చేసాయి. అక్కడి నుండి మురికివాడల్లోకి ప్రవేశించి పేద వారికి సేవ చేయడం ఆరంభించారు.మోతిజిల్ లో్ ఒక పాఠశాలను ప్రారంభించి అన్నార్తులను ఆదుకోవడం మొదలెట్టారు.


1946లో కేవలం కాన్వెంట్ లో ఉపాధ్యాయురాలిగానే కాకుండా తనవంతుగా ప్రజలకు సేవ చేయాలని తలచి తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి ఎంతో నిరాడంబరమైన నీలపు అంచుగల తెల్ల చీరను ధరించి, భారతదేశ పౌరసత్వం స్వీకరించారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు అప్పటి అధికారులను ఎంతో ఆకర్షించాయి. 1950 అక్టోబర్ లో వాటికన్ అనుమతితో మతగురువుల సంఘం ఆవిర్భవించింది. అదే తదనంతరం మిషినరీ ఆఫ్ చారిటీస్ గా రూపాంతరం చెందింది.ఆపై ఇథియోపియా లో ఆకలి బాధలతో అల్లడుతున్న అన్నార్తులను ఆదుకోవడం, ఇజ్రాయిల్ సైన్యానికి పాలస్తీనా గెరిల్లాల మధ్య కాల్పులు జరిగిన సమయంలో ఒక వైద్యశాలలో చిక్కుకుపోయిన దాదాపుగా 37 మంది పిల్లలను ఆమె కాపాడారు. ఆ విధంగా తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన మదర్ థెరీసా 1983లో పోప్ జాన్ పాల్ ని చూడడానికి వెళ్ళినపుడు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. ఆపై ఆమెకు 1989లో మరొకసారి గుండెపోటు రావడంతో ఆమెకు కృత్రిమ పేస్ మేకర్ ని అమర్చారు డాక్టర్లు.

1996లో ఆమెకు దెబ్బ తగిలి మెడ ఎముక విరగడం, ఆపై ఆమె కొన్నాళ్లకే మలేరియా వ్యాధికి గురవడంతో గుండె ఎడమభాగంలోని జఠరిక పనిచేయడం మానేసింది. ఆపై ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో 1997, మార్చి 13న ఆమె అధ్యక్ష పదవినుండి వైదొలిగారు.అదే ఏడాది సెప్టెంబర్ 5న ఆమె మరణించారు.

1962లో ఆమెకు మన భారత ప్రభుత్వం తరపున పద్మశ్రీ బిరుదు లభించింది. 1972లో పండిత్‌ జవహర్ లాల్ నెహ్రు అవార్డు, అలానే 1980లో ప్రఖ్యాత పురస్కారం భారతరత్న కూడా అందుకున్నారు. కాగా ఆమె జీవిత చరిత్రను ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి నవీన్ చావ్లా 1992లో స్వయంగా రచించి, పుస్తకంగా ప్రచురించారు.అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆమె పేరున స్థాపించబడ్డ మిషినరీస్ ఆఫ్ చారిటీస్ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తరించి ఎందరో మహానుభావుల విరాళాలతో చక్కగా ముందుకు నడుస్తోంది. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడాలి, బాధల్లో ఉన్నవారికి తమవంతుగా సేవ చేయాలి అనే భావన అందరిలోనూ కలగాలి అనే మాట థెరీసా తరచూ చెప్తూ ఉంటారు.!!

నిరాడంబర సేవామూర్తి మదర్‌ థెరిసాకి V3 న్యూస్‌ ఛానల్‌ యాజమాన్యం జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తోంది.

Leave a Reply