పంట పొలాలో మున్సిపల్ చెత్త ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు

Share this:

మెట్పల్లి(V3 News )16-07-2022: మెట్పల్లి పట్టణంలోని చెత్త సేకరణ వాహనాలను అడ్డుకున్న రైతులు 14 ఎకరాల డంపింగ్ యార్డ్ ఉన్న పంట పొలాల వద్ద చెత్తను డంపు చేస్తున్నారని మరియు జంతు కళేబరాలను బొక్క లను కుక్కలు మరియు కోతులు పంట పొలాల్లో పార వేస్తున్నాయని దుర్వాసన మూలంగా వ్యవసాయం చేయలేక పోతున్నామని రైతులు వాపోయారు అధికారులు స్పందించి చెట్లను డంపింగ్ యార్డ్ లోనే పోయాలని కోరుచున్నారు దాదాపుగా 15 చెత్త సేకరణ వాహనాలను ఉదయం నుండి అడ్డుకున్నారు మునిసిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు .ఈ కార్యక్రమంలో సుతారి బాలరాజు జెట్టి గంగాధర్ జక్కుల నగేష్ ఓజ్జల లింగన్న ఓజ్జల శ్రీనివాస్ ఆకుల నరేష్ గెట్టి లింగం నర్సా గౌడ్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply