తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు

Share this:

నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో తెలంగాణలోని రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి..
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి రిజర్వాయర్ నిండుకుండలా మారింది మూసీ ప్రాజెక్టుకు ఎగువన హైదరాబాద్ వైపు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరదనీరు అత్యధికంగా రావడంతో గత నాలుగు రోజులుగా ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో నిలకడగా కొనసాగుతుండటంతో ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రాజెక్ట్ నీటిమట్టం 645 అడుగుల గరిష్ట స్థాయికి గాను 644.61 అడుగులకు చేరటంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు యొక్క 3,7,10 వ నెంబర్ మొత్తం 3 గేట్లు ఒక ఫీట్ మేర పైకి ఎత్తి మూసి దిగువకు నీటిని విడుదల చేశారు మూసి ప్రాజెక్టు అధికారులు..మూసీ ప్రాజెక్టుకు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను ప్రాజెక్టు దిగువన సాగు చేసే రైతాంగాన్ని అలెర్ట్ చేశారు అధికారులు.

ప్రస్తుతం
ఇన్ ఫ్లో : 1247.79 క్యూసెక్కులు

• అవుట్ ఫ్లో : 1992.74 క్యూసెక్కులు.

• పూర్తి స్థాయి నీటిమట్టం : 645 ఫీట్లు

• ప్రస్తుత నీటిమట్టం : 644.61ఫీట్లు

• పూర్తి స్థాయి సామర్థ్యం : 4.46 టీఎంసీలు.

• ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 4.36 టీఎంసీలు.
గా నమోదైంది.

Leave a Reply