నాగారం మత్స సహకార సంఘం అధ్యక్షులుగా దామెర రాజు ఎన్నిక

Share this:

హసన్ పర్తి మండలం నాగారం మత్స సహకార సంఘం ఎన్నికల్లో దామెర రాజు ప్యానెల్ ఘన విజయం సాధించిందని ఎన్నికల అధికారి రవీంద్ర మీడియాకు తెలిపారు.ఈ ఎన్నికల్లో దామెర రాజు,తౌటం భిక్షపతి,కళ్లబోయిన మల్లయ్య,తాళ్ల నర్సయ్య, ములుకలపల్లి రఘుపతి,గొర్రె అగ్ని కులశేఖర్,రావుల సృజన్ రావు,సమ్మయ్య,రావుల కుమారస్వామి డైరెక్టర్లు గా ఎన్నికయ్యారు.అనంతరం నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు అందరూ కలిసి నాగారం మత్స సహకార సంఘం అధ్యక్షులుగా దామెర రాజును,ఉపాధ్యక్షులుగా తాళ్ల నర్సయ్యను,కార్యదర్శిగా కళ్లబోయిన మల్లయ్యలను ఎన్నుకున్నారు.అనంతరం నాగారం మత్స సహకార సంఘం అధ్యక్షులు దామెర రాజు ఆధ్వర్యంలో డైరెక్టర్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు.

Leave a Reply