జిల్లాలో స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది

Share this:

ఆత్మకూరు(V3News) 27-07-2022: ఆత్మకూరు (s)మండలం నశింపేట గ్రామ పంచాయతీలో ని చివేముల టు ముకుందాపురం ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వాగు వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులను మాజీ మంత్రి టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తెలుసుకున్నరు.ఈ నేపథ్యంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో 25 మంది పిల్లలతో వెళుతున్న స్కూల్ బస్సు చిక్కుకుంది వాగు ఉధృతకి ముందుకు వెళ్లలేక నిలిచిపోయినా ఘటన ఆత్మకూరు ఎస్ మండలం నసీంపేట గ్రామం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది అప్పుడే వరదను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దామోదర్ అనుచరుల సహాయంతో స్వయంగా బస్సును బయటికి తీపించారు… ఈ ఘటనతో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న బస్సు కు ముందుకు పోనిచ్చిన డ్రైవర్ కు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మందలించారు… స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేసి చివాట్లు పెట్టారు పిల్లలంతా క్షేమంగా బయటపడడంతో పిల్లల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు

Leave a Reply