నూతన పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి

Share this:

ఆసరా పెన్షన్ పథకం ద్వారా వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు,వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మంగళవారం అన్నారు.గ్రేటర్ వరంగల్ 1, 2వ డివిజన్లకు చెందిన 438 మంది నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను ములుగు రోడ్డు వజ్ర గార్డెన్స్ లో ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కండ్లల్లో ఆనందం చూడటమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని,దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. వృద్ధాప్య పెన్షన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,డివిజన్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.