నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి-మాలమహానాడు

Share this:

దేశంలోని రాజకీయ పార్టీలు మత కుల రాజకీయాలను ప్రోత్సహించడం మానుకొని నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు ముందుకు రావాలని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న జిల్లా అధ్యక్షులు అశోద రవి లు అన్నారు. పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం స్థానిక రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అశోద రవి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి, సిఎం కెసిఆర్ మంత్రి జగదీష్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట మురళీ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గాజుల రాంబాయమ్మ, రాష్ట్ర కార్యదర్శి అనుముల పూరి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల రమేష్, జిల్లా కార్యదర్శి బొల్లెద్దు వెంకటేశ్వర్లు, ప్రసాద్, మద్దెల రాము, కంచె సరిత, రాయిరాల జానయ్య, దోమల రమణయ్య, వాసా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.