బాపట్లలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ఏర్పాట్ల పరిశీలన

Share this:

బాపట్ల లోని ఏజీ కాలేజీ ఎదురుగా వున్న తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బాపట్ల టీడీపీ ఇన్ చార్జ్ వేగేశన నరేంద్రవర్మ తో కలిసి బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు,టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగాని సత్యప్రసాద్ పాల్గొని టీడీపీ నూతన కార్యాలయం ను పరిశీలించారు.ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు చేతులమీదుగా తెలుగుదేశం పార్టీ దేవాలయాన్ని ప్రారంభించటం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి గుంటూరు,ప్రకాశం జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు,రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంటు కమిటీ సభ్యులు,అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆహ్వాిస్తున్నామని మాట్లాడారు.బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మినీ మహానాడు ను ఏర్పాటుచేస్తున్నామని అన్నారు.పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు,రాష్ట్ర కమూటీ సభ్యులు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు సలగల రాజశేఖర్, గూడపాటి శ్రీనివాసరావు,పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దయాబాబు, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మానం విజేత, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సరోజినీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply