ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న ఐదుగురు జూదగాళ్ల ను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ & అంతర్గం పోలీసులు

Share this:

47 సెల్ ఫోన్ లు,02 రూటర్స్,02 బైక్ లు, చార్జర్స్ -07,స్వాధీనం

పెద్దపల్లి(v3News) 30-04-2022: పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ని, అంతర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దంపేట గ్రామ శివారు లోని కోళ్ల ఫారం లో కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి ఆన్లైన్ రమ్మి జూదన్నీ, ఎవరికి అనుమానం రాకుండా ఫోన్లలో ఆడుతున్న రనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, అంతర్గాం ఎస్ఐ శ్రీధర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో కలిసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది.!
వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా ఇతర యువకుల సహాయంతో వారి మిత్రుల యొక్క ఫోన్లను సేకరించి నకిలీ జిపిఎస్ సిస్టమ్ ద్వారా తెలంగాణ లో ఉండి కూడా వేరే ప్రాంతంలో ఉన్నట్టు చూపిస్తూ జూదం ఆడడం జరుగుతుందని ఒప్పుకోవడం జరిగింది.! తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని కూడా నిషేధించడంతో నకిలీ జిపిఎస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రమ్మీ కల్చర్, ఆన్లైన్ రమ్మీ వంటి అప్లికేషన్ల ద్వారా ఆన్లైన్ రమ్మీ ఆడడం జరుగుతుందని, అంతేకాకుండా ఒకే చోట ఐదు ఫోన్లలో వేరు వేరు యూజర్ ఐడి లతో చీటింగ్ గేమ్ ఆడడం ద్వారా ఆన్లైన్ గేమ్ లో కూడా చీటింగ్ చేయడం జరుగుతుంది అని తెలపడం జరిగింది.

నిందితుల వివరాలు:
1.బంగారి మధు,
2.నాలాపు అజయ్,
3.పొన్నం స్వామి,
4.మడ్డి నవీన్,
5.చీమల సూరజ్,
గా గుర్తించారు..!
ఇట్టి టాస్క్ లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, అంతర్గాం ఎస్ఐ శ్రీధర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్, మహేందర్, ప్రకాష్, మల్లేష్, సుదర్శన్ పాల్గొన్నారు.

Leave a Reply