ఎమ్మెల్యే వనమా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉప సర్పంచ్ బర్లలక్ష్మణరావు మరియు గ్రామ ప్రజలు

Share this:

పాల్వంచ(V3News): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, కిన్నెరసాని రాజాపురం నుండి ఉల్వ నూర్ చంద్రాలగూడెం వరకు బిటి రోడ్డు మంజూరు చేయించినందుకు గాను, మరియు రాజాపురం -యానం బైల్ గ్రామాల మధ్యలో ఉన్న కిన్నెరసాని వాగుపై బ్రిడ్జి మంజూరు చేయించినందుకు గాను ఈరోజు ఉల్వ నూర్ గ్రామం ప్రధాన రహదారిపై స్థానిక ఉప సర్పంచ్ బర్ల లక్ష్మణరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ బర్ల లక్ష్మన్ రావు మాట్లాడుతూ….రాజాపురం నుండి ఉల్వ నూరు చంద్రాల గూడెం వరకు ఉన్న రోడ్డును మంజూరు చేయించి నందుకు మరియురాజాపురం యానంబైల్ గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి ని మంజూరు చేయించి నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇంకా మాట్లాడుతూ.. ఉల్వ నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆస్పత్రిగా మార్చాలని, గ్రామంలో సిసి రోడ్లు వేయించాలని, దళిత వాడను అభివృద్ధి పరచాలని, అంగన్వాడి భవనాలను నిర్మించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మేరుగు దేవరాజు, నక్క వెంకన్న, మోహన్ రావు, జగన్, పానుగంటి రామ్మూర్తి, భూషణం, శ్యాగల సుందరం, తడికల దాసు,నిట్ట నరసింహారావు, బేతం లవన్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply