ప్రాజెక్ట్ బాధితులం..! సంబంధిత అధికారులు మమ్మల్ని పట్టించుకోండి…

Share this:

  • సమస్యను పట్టించుకోకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఐదు కుటుంబాలు…

భైంసా(V3News) : పళ్సీకర్ రంగారావుప్రాజెక్ట్ బాధితులం మైన ఐదు దళిత కుటుంబాలను పట్టించుకోవాలి అంటూ శుక్రవారం భైంసా పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బై0సా మండలం కోతల్ గావ్ గ్రామానికి చెందిన ఆనంద్ బోతే అనే ఓ రైతు, వీరితో పాటు మిగతా నాలుగు కుటుంబాలు అమర నిరాహార దీక్షకు దిగారు. అమర నిరాహార దీక్ష చేపట్టిన బాధితులకి V3 న్యూస్ ప్రతినిధి పలకరించగా తాను తెలిపిన విషయాలు…మెము దళిత రైతుల0అని బై0సా మండలం కోతల్ గావ్ గ్రామ శివారులో సర్వేనెంబర్ 195 లో ఉమ్మడి ఆస్తి గా మాకు 8 ఎకరాల భూమిలో 1996 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ కింద రెండు బోర్లు వేయి0చామని,ఈ బోర్లు సహాయంతో పొలంలో 2006 వరకు రెండు పంటలు పండించి సంతోషంగా ఉన్నామని,2006 సంవత్సరంలో పళ్సీకర్ రంగారావు ప్రాజెక్టు నిర్మణ సమయంలో విద్యుత్ స్తంభాలను తొలగించడంతో బోర్లు కాస్త విద్యాసౌకర్యాలు అందక మూలనపడ్డాయి. దీంతో వ్యవసాయదారునికి రెండో పంట కాలమైన రబి సీజన్ మూగబోయింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత కట్ట క్రింద నీరు వెళ్లడానికి అనువైన నిర్మాణాలు చేపట్టకపోవడంతో కట్ట పై పడిన వర్షపు నీరు పూర్తి మొత్తంలో పంటపొలాల్లోకి నిరు వచ్చి వ్యవసాయదారునలకి మొదటి పంట కాలమైన ఖరీఫ్ సీజన్ కూడా చేదు ఆనూబావాన్నే ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకున్న ఇంట్లో ఉన్న బంగారాన్ని కాస్త తాకట్టు పెట్టి విద్యుత్ సప్లై కి సంబంధించిన పనులను పూర్తి చేసుకోన్న… ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు అది కాస్త పాడయ్యాయి. తీసుకున్న అప్పు పెరిగిపోయింది,వడ్డీ కాస్త రెట్టింపు అయ్యింది. విద్యుత్ ,ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య మాత్రం తీరడం లేద0టు ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ రోజు అమర నిరాహారదీక్ష చే పెట్టి ఆ రైతు కన్నీరు మూన్నిరు అయ్యారు.వీరికి ప్రముఖ మరాఠి,హిందీ కవి మధు బావల్ కర్,కౌన్సిలర్ గౌతమ్ పి0గళే సంగిఁభావం తెలిపారు.

Leave a Reply