27వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం

Share this:

  • మంత్రి జగదీష్ రెడ్డి హయాంలోనే సమగ్రాభివృద్ధి
  • ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి విజయవంతం
  • ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టెంట్ సదుపాయం,కుర్చీలు, మంచినీరు అన్ని ఏర్పాట్లను కల్పించిన కౌన్సిలర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతుందని మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ అన్నారు సోమవారం పట్టణ ప్రగతి లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో 27 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు పనులను 27 వార్డు కౌన్సిలర్ చిరివేళ్ళ లక్ష్మీకాంతమ్మ కలిసి ప్రారంభించరు..ఈ సందర్భంగా చైర్మన్ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీ కాంతమ్మ మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.. ఈ సందర్భంగా అర్బన్ పార్క్ ఆవరణలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మొక్కలు నాటారు.

Leave a Reply