నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్లపై పీడీ యాక్ట్ …ఎడి.అవినాష్ శర్మ

Share this:

నల్లబెల్లి(v3news) 24-08-2022: నల్లబెల్లి మండలం లోని వ్యవసాయశాఖ పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లు,ఏజెంట్లతో రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ అధికారి పరమేశ్వర్ అధ్యక్షతన అవగాహనా సదస్సు మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అవినాష్ శర్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా అవినాష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ వానాకాలం పంటల సాగు సందర్భంగా నల్లబెల్లి మండలం లోని డీలర్లు రైతులకు నాణ్యమైన అధిక దిగుబడి,అధిక ఆదాయం ఇచ్చే విత్తనాలు,ఎరువులు, పురుగు మందులను అందించాలని సూచించినట్లు తెలిపారు.ఎరువుల డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు విక్రయిస్తే చట్టపరంగా పీడీ యాక్ట్ నమోదు చేసి,వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్ రెడ్డి,నల్లబెల్లి మండలం ఫర్టిలైజర్ డీలర్ల సంఘం కోశాధికారి మచ్చిక రవీందర్ గౌడ్,డీలర్లు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply