ప్రశాంతంగా మొదలైన TSLPRB కానిస్టేబుల్ పరీక్షలు

Share this:

వికారాబాద్(V3news) 28-08-2022: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నేడు జరుగుతున్న కానిస్టేబుల్ పరీక్షకు పరిగి పట్టణంలో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరిగి డిఎస్పి కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ వెంకటరామయ్య ,ఏడుగురు ఎస్ఐ లతో 60 మంది పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గంట ముందే పరీక్ష కేంద్రాల్లోనికి విద్యార్థులను అనుమతించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విట్టల్ రెడ్డి మాట్లాడుతూ గంట ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరిగిందని తెలిపారు బయోమెట్రిక్ తో వేలిముద్రలు గుర్తించే అవకాశం ఉందని తెలిపారు పరిగి పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు 30036 విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎస్పీ కోటిరెడ్డి ఆదేశానుసారం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.