ఇసుక అక్రమ రవాణా అరికట్టండి

Share this:

జమ్మలమడుగు ను ఆనుకొని ఉన్న పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా సాగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ దేవ గుడి నారాయణ రెడ్డి ఆరోపించారు. మంగళవారం జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్నా,చిత్రావతి నదీ ఇసుకపై పూర్తి హక్కు తమ ప్రాంత వాసులకు ఉందని,అయితే వై ఎస్ ఆర్ పార్టీ ఇసుకాసురులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ భావి తరాల భవిష్యత్తు ను క్యాష్ గా మార్చుకుంటున్నారు అన్నారు.లోకాయుక్త జస్టిస్ లక్ష్మిరెడ్డి పెన్నా,చిత్రావతి నదుల్లో ఇసుక అక్రమ రవాణా కారణంగా రాళ్ళు తెలాయని..భవిష్యత్ తరాలకు అందించటానికి ఇసుక అందని ద్రాక్ష అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ లో నివాసం వుండి కర్నూలు జిల్లా లోకాయుక్త జస్టిస్ లక్ష్మీరెడ్డి కు ఇసుక అక్రమ రవాణా విషయం తెలిస్తే స్థానిక అధికారులకు మాత్రం తెలియనట్లు వ్యవహరించడం బాధాకరం అన్నారు.ఇప్పటికైనా అధికారులు అక్రమ ఇసుక రవాణా అరికట్టక పోతే తెలుగుదేశం పార్టీ తరపున ఉద్యమిస్తామని అన్నారు