తెలంగాణచరిత్రలోనే గొప్ప సభగా మోదీ బహిరంగ సభ నిలిచిపోతుంది : డికే అరుణ
Share this:
చరిత్రలోనే గొప్ప సభగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ నిలిచిపోతుందని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మోదీ సభకు లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారన్నారు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నియంత మాదిరి పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మిగిలిందని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారని, ఎన్నికల హామీలు అమలులో విఫలమయ్యారని డీకే అరుణ విమర్శలు గుప్పించారు.