రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి-అయ్యన్న

Share this:

అనుభవం లేని వ్యక్తిని, ఆర్దిక నేరస్తుడిని ముఖ్యమంత్రిని చేhస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనం కళ్ళారా చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలు ధర 3 రూపాయల పన్నెండు పైసలు ఉంటే, జగన్ రెడ్డి మాత్రం తన కమీషన్ల కోసం 6 రూపాయల నుండి 11 రూపాయల వరకు కొంటున్నాడు. ఆ భారాన్ని మళ్ళి ప్రజలపైనే వేస్తున్నారు. పాదయాత్రలో నేను ముఖ్యమంత్రి అయితే 200 యూనిట్లు వరకు కరెంట్ ఉచితంగా ఇస్తాను చెప్పి, మాట తప్పి మడమ తిప్పాడు. విద్యుత్ చార్జీలు పెంచనని ప్రచారం చేసుకొని తీరా గెలిచాక ఈ రెండున్నర సంవత్సరాలలో సుమారు 37 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు.చంద్రబాబు గారి హయంలో 1500 కరెంట్ బిల్లు వస్తే, ఇప్పుడు  జగన్ రెడ్డి పరిపాలనలో 4000 వస్తుంది. 60 రూపాయల ఉన్న బ్రాందీ సీసాను, 180 రూపాలకు చెత్త బ్రాండ్ లను ప్రజలకు అమ్ముతున్నారు. మద్యం అలవాటు ఉన్న వ్యక్తి కుటుంబం నుండి సంవత్సరానికి  40 వేల రూపాయలు గుంజుకుంటున్నారు.అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం లోనే కరెంట్ చార్జీలు అధికంగా పెంచారు.  ఇలా పెంచుకుంటూ పోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి.పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి, పరిశ్రమలు రాకపోతే మన పిల్లల భవిష్యత్ ఏంటి..? రెండున్నర సవత్సరాలలో  2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే రైతు మెడకు ఉరి బిగించడమే.చంద్రబాబు గారు టైంలో తన అనుభవంతో అదనంగా 10 వేల మెగావాట్లు ఉత్పత్తి చేశారు. కరెంట్ కోతలు లేవు, విద్యుత్ చార్జీలు పెంచలేదు. అందువలనే రాష్ట్రానికి 5 లక్షల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చాయి. దాని మూలంగా 5 లక్షల 13 వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. ఈ రెండున్నర  సంవత్సరాలలో జగన్ రెడ్డి 6 సార్లు కరెంట్ చార్జీలు పెంచి, ప్రజలపై సుమారు 37 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు.ట్రూ అప్ చార్జీలు వసూలు చేస్తున్నారు. అసలు ట్రూ అప్ చార్జీలకు ప్రజలకు సంబంధం ఏంటి…? ఎందుకు వసూలు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్లు

1. ట్రూఅప్ ఛార్జీలు నిలుపుదల చేయడం కాదు, పూర్తిగా రద్దు చేయాలి.

2. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే చర్యలు వెంటనే విరమించుకోవాలి.

3. జగన్ రెడ్డి ఎన్నికల హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచరాదు. ఇప్పటివరకు వసూలు చేసిన ఛార్జీలు రిఫండ్ చేయాలి.

4. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.12 వేల కోట్లు వెంటనే చెల్లించాలి.

5. ప్రభుత్వరంగ సంస్థలు డిస్కమ్లకు బకాయి వున్న రూ.10,800 కోట్లు చెల్లింపులకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.

6. ప్రభుత్వ విద్యుత్ సంస్థల సామర్థ్యం మేరకు పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి చేయాలి.

7. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయరాదు.

Leave a Reply